చలికాలంలో అల్లం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-బి, విటమిన్-సి, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, జింక్ వంటి గుణాలు ఉంటాయి. అల్లం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.