మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో భాగంగా బీజేపీ పార్టీ నేత జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా ఈసీ లేఖలు రాసింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని బీజేపీ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదులపై స్పందించిన ఈసీ ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు అధికారికంగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం పార్టీల అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది.