AP : ముఖ్యమంత్రి జగన్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ స్పందించింది. నోటీసులపై సకాలంలో స్పందించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఇటీవలే చంద్రబాబుకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.