తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓటర్లకు కొన్ని సూచనలు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో ఓటు వేయడానికి వెళ్లండి. మధ్యాహ్న సమయంలో ఓటు వేయడానికి బయటకు వెళ్తే కూలింగ్ గ్లాసెస్ ఉపయోగించాలి. మహిళలు ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వెళితే మంచిది. ఇంట్లోనే నీరు తాగి బయలుదేరాలని సూచించారు.