AP : ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేటు వేసిన ఎన్నికల కమిషన్. ఆరుగురు ఐపీఎస్‌లను, ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన ఎన్నికల సంఘం. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు , అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై బదిలీ వేటు. అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశపై బదిలీ వేటు. బదిలీ అయినవారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ. ఐపీఎస్‌లను జనరల్ అడ్మినిస్ట్రేషన్‌కు అటాచ్ చేయాలని ఆదేశించిన ఎన్నికల కమిషన్.