ED-MLC KAVITHA:ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. నేడు ఈడీ ఆమెను ఈడీ విచారించనున్నారు. ఆమెతో పాటు ఒక న్యాయవాది సైతం వెళ్లారు. సీఎం కేసీఆర్ నివాసం నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఈడీ కార్యాలయానికి వెళ్లడానికి ముందు తన సోదరుడు మంత్రి కేటీఆర్, హరీష్‌రావులతో భేటీ అయ్యారు. ఉదయం నుంచే ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద హడావుడి కొనసాగుతోంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు పెద్ద ఎత్తున కవితకు మద్దతు తెలిపారు.