– 10న విచారణకు హాజరుకావాలని తాఖీదులు
ఇదేనిజం, హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నవదీప్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవలే నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. అయితే.. నార్కోటిక్ బ్యూరో కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన నవదీప్‌ను హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఏడాది సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది.