Homeఫ్లాష్ ఫ్లాష్ED notices to Ranbir Kapoor రణ్ బీర్​ కపూర్​కు ఈడీ నోటీసులు

ED notices to Ranbir Kapoor రణ్ బీర్​ కపూర్​కు ఈడీ నోటీసులు

– ఆన్​ లైన్​ గేమింగ్​ యాప్ కేసులో
విచారించనున్న దర్యాప్తు సంస్థ
– మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు

ఇదేనిజం, హైదరాబాద్​: ఆన్ లైన్​ యాప్​ బెట్టింగ్​ కేసులో బాలీవుడ్ నటుడు రణ్ బీర్​ కపూర్​ నోటీసులు అందుకున్నారు. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఇటీవల మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో ఈడీ చేపట్టిన దర్యాప్తులో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీల పేర్లు వినిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న ఓ భారీ కుంభకోణాన్ని ఇటీవల ఈడీ బట్టబయలు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్‌ చంద్రఖర్‌, రవి ఉప్పల్‌ యూఏఈలోని దుబాయ్‌ కేంద్రంగా దేశంలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.
బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హావాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల్లో ఒకరి పెళ్లికి వీరు హాజరవ్వడమే దీనికి కారణం. ఈ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రఖర్‌ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌, సన్నీ లియోనీ, నేహా కక్కర్‌, అతిఫ్‌ అస్లమ్‌, రహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్‌, అలీ అస్గర్‌, విశాల్‌ దద్లానీ తదితరులు హాజరయ్యారు. వీరి కోసం ఓ ప్రైవేటు జెట్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆ వేడుకకు హాజరైన సినీతారలపై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రణ్‌బీర్‌ కపూర్‌కు తాజాగా సమన్లు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img