Homeక్రైంఆప్ మంత్రి రాజ్​కుమార్ ఇంట్లో ED Rides

ఆప్ మంత్రి రాజ్​కుమార్ ఇంట్లో ED Rides

– మనీలాండరింగ్ కేసుతో సంబంధముందన్న అనుమానంతో తనిఖీలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)సమన్లు జారీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే.. ఆ పార్టీకే చెందిన మరో నేత ఇంట్లోనూ సోదాలు చేపట్టింది. ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్‌ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఈడీ ప్రస్తుతం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం తెల్లవారుజామునే అధికారులు మంత్రి ఇంటికి చేరుకొని సోదాలు మొదలుపెట్టారు. రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఢిల్లీ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంతో ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణలో భాగంగా నేడు ఆయన ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. గతంలోనూ ఆయనను సీబీఐ 9 గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. తమ నేతలపై ఈడీ దాడులను ఆప్‌ తీవ్రంగా ఖండిస్తోంది. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు నిర్వహిస్తోందని ఆరోపించింది. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పటికీ ఆయనకు బెయిల్‌ రాలేదు. ఇటీవల ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ను మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేసింది. తాజాగా మరో నేత ఇంట్లో సోదాలు జరుపుతోంది.

Recent

- Advertisment -spot_img