ఝార్ఖండ్ మంత్రిత్వ కార్యదర్శి వద్ద రూ. 20 కోట్ల నగదు పట్టుబడింది. గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజినీర్ గా చేస్తున్న వీరేంద్ర కే రాజ్ పై రూ.100 కోట్ల అవినీతికి సంబంధించిన కేసులున్నాయి. ఆ కేసుకు సంబంధించి ఆ శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అతడి పనిమనిషి సాయంతో డబ్బును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.