ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో మూడు కంపెనీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వారింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ….అజారుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్లెంట్ ఎంటర్ప్రైజెస్ అనే మూడు కంపెనీలకు ఈనెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.