Homeజాతీయంవిద్యాసంస్థలు తెరుచుకోవచ్చు

విద్యాసంస్థలు తెరుచుకోవచ్చు

సెప్టెంబర్​ నుంచి విద్యాసంస్థలను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించింది. మార్చి నుంచి కరోనా విజృంభన కారణంగా అన్ని రకాలు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డ విషయం అందరికీ తెలిసినదే. అయితే తరువాత కూడా కరోనా తగ్గుముఖం పట్టక రాను రాను పెరుగుతుండడంతో అనేక రకాల పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ఇళ్ళకే పరిమితం చేశారు. అనంతరం ఈ నెల నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడంతో తిరిగి విద్యాసంస్థలు తమ కార్యకలాపాలను జరిపేందుకు తిరిగి విద్యా సంస్థలను తెరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. జాగ్రత్త చర్యలు పాటిస్తూ తరగతులు నిర్వహించుకుంటామని ప్రభుత్వానికి పలు సార్లు విన్నవించుకున్నాయి. దీంతో పాటు విద్యా సంవత్సరం వృదా అవుతుందన్న ఉద్దేశంతో కేంద్ర మార్గదర్శకాలు పాటిస్తూ తరగతులు నిర్వహించుకునేందుకు కేంద్రం అనుమతించింది. అలాగే పరిస్థితులను బట్టి విద్యాసంస్థలను తిరిగి తెరవాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలకు నిర్ణయాధికారాన్ని ఇచ్చింది కేంద్రం. దీంతో సెప్టెంబర్​ 1 నుంచి పలు విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. అటు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థల రీఓపెన్​ను వ్యతిరేఖిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img