దసరా సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత 5 రోజుల్లో 25% విక్రయాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. సగటున 2 లక్షల కేసుల బీరు, రూ.1.20 లక్షల మద్యం కేసుల విక్రయాలు జరిగాయి. ఈ నెల 10వ తేదీన రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి మద్యం దుకాణాలకు తరలివెళ్లింది. ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు మొత్తం రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.