హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి మెట్రో రైళ్లలో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. రద్దీ కారణంగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ ప్రయాణికుల కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణం చేయడంతో నగరంలోని అన్ని మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిపోయాయి. వీరంతా టికెట్ కోసం క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు.