– హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి బాలలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. 1 జనవరి నుంచి 31 జనవరి వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమ సమన్వయ కార్యక్రమంపై గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా బాలల సంక్షేమ అధికారి కే మధురిమ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. తప్పిపోయిన, వదిలేసిన, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, బాలకార్మికులు, 14 సంవత్సరాలలోపు, 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు గల వారితో ప్రమాదకరమైన పనులు చేస్తున్నవారిని గుర్తించాలని సూచించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే డయల్ 100కు సమాచారాన్ని అందించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. సమన్వయ సమీక్ష సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సందసాని రాజేంద్ర ప్రసాద్, పీ హైమావతి, వివిధ శాఖల అధికారులు రమేశ్, బుర్ర అశోక్ కుమార్, డాక్టర్ సాంబశివరావు, అబ్దుల్ హై, వెంకట్ రామ్, ఎం సంజీవ రావు, రామ్మూర్తి, ప్రసాద్, సంతోష్ కుమార్, ఎస్ ప్రవీణ్ కుమార్, ఎం మౌనిక, ఏ సతీష్ కుమార్, ఎస్ భాస్కర్ , కల్యాణి, ఆర్ రాజ కుమారి, చాణక్య, ఏ మాధవి, ఎం శ్రీనివాసులు, జీ సునీత, పీ విజయ్ కుమార్, జయవర్దన్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.