తమిళనాడులోొని శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. టపాసుల దుకాణంలో పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాంబులు తయారు చేసే క్రమంలో రసాయనాలు కలుపుతుండగా ఏర్పడ్డ ఘర్షణ వల్ల పేలుడు సంభవించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టపాసుల తయారీకి పేరుగాంచిన శివకాశిలోని పరిశ్రమల్లో కొన్నివేల మంది పని చేస్తున్నారు. రసాయనాలపై శ్రామికులకు సరైన అవగాహన లేకోవడంతోనే అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.