Homeహైదరాబాద్latest Newsఏక్​ తేరా.. ఏక్​ మేరా.. లంచం తీసుకొని..సొమ్ము పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి...

ఏక్​ తేరా.. ఏక్​ మేరా.. లంచం తీసుకొని..సొమ్ము పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి (VIDEO)

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో : లంచం తీసుకున్న సొమ్ము పంచుకుంటూ ట్రాఫిక్​ పోలీసులు కెమెరాకు చిక్కారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. శనివారం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి వసూలు చేసిన లంచం సొమ్మును నిజాయితీగా వాటాలు వేసుకున్నారు. గాజీపూర్​లోని చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. అయితే, వారి వాటాల పంపకం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవుతోందనే విషయం గుర్తించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వరకు చేరింది. దీంతో ఆయన సీరియస్​గా స్పందించారు. వెంటనే సదరు ట్రాఫిక్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారిపై డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ‘లంచం నోట్లు పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్​స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశాం. ప్రాథమిక విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకున్నాం. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం’అంటూ ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img