శీతాకాల సమావేశాలకు ముందు పాలిమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మంగళవారం మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యమంత్రి కుర్చీని కోల్పోవడంతో ఏక్‌నాథ్ షిండే కలత చెందారని కేంద్ర మంత్రి అథవాలే వెల్లడించారు. షిండే స్థానంలో సీనియర్ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేస్తుందని వార్తలు వచ్చాయి. షిండే ఈ పదవిని లేదా మహాయుతిలో మరొక ప్రముఖ పాత్రను అంగీకరించాలని అథవాలే సూచించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం డిసెంబర్ 5, గురువారం జరగాల్సి ఉంది. బిజెపికి కొత్తగా ఎన్నికైన 132 మంది ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు, రేపు సిఎం పేరుపై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది.