HomeజాతీయంMaharashtra : మహా ప‌రీక్ష‌లో నెగ్గిన‌ ఏక్ నాథ్ షిండే

Maharashtra : మహా ప‌రీక్ష‌లో నెగ్గిన‌ ఏక్ నాథ్ షిండే

Maharashtra : మహా ప‌రీక్ష‌లో నెగ్గిన‌ ఏక్ నాథ్ షిండే

Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు.

ఈ ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో షిండే విజయం సాధించారు.

శాసన సభలో జరిగిన ఓటింగ్ లో షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు.

ఇందులో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు.

విశ్వాస పరీక్షలో నెగ్గిన షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని కాపాడుకున్నారు.

ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి.

నిన్నటిదాకా అఘాడి కూటమితో ఉన్న శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ చివరి నిమిషంలో థాకరేకు షాకిచ్చారు.

బల పరీక్షలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.

షిండేకు మద్దతుగా బీజేపీతోపాటు బహుజన్ వికాస్ అఘాడి కూడా ఓటు వేసింది.

ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు సమాజ్ వాద్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేశారు.

Recent

- Advertisment -spot_img