నల్లగొండ జిల్లా దేవరకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో కారు బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నెమలిపూర్ తండాకు చెందిన వృద్ధురాలు రమావత్ నీరి (70) మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.