Homeఫ్లాష్ ఫ్లాష్‘గ్రేటర్‌’ ఫైనల్‌ ఓటింగ్‌ 46.68 శాతం.. 20 ఏళ్లలో ఇదే అత్యధికం

‘గ్రేటర్‌’ ఫైనల్‌ ఓటింగ్‌ 46.68 శాతం.. 20 ఏళ్లలో ఇదే అత్యధికం

హైదరాబాద్‌ : బల్దియా ఎన్నికల్లో తుది ఓటింగ్‌ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది.

గ్రేటర్‌ పరిధిలోని మొత్తం 149 డివిజన్లలో పోలింగ్‌ జరగగా 46.68 శాతం ఓటింగ్‌ నమోదు అయింది.

ఓల్డ్‌ మలక్‌పేటలో అభ్యర్థుల సీరియల్ నెంబర్ల తారుమారు కావడంతో ఓ డివిజన్ ఎన్నిక రేపు జరుగనుంది.

గత 20 ఏళ్లలో జీహెచ్‌ఎంసీలో ఇదే అత్యధికంగా పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం.
క్రితంసారి ఎన్నికల్లో (2016) 45శాతం పోలింగ్‌ నమోదు అయింది.

కంచన్‌బాగ్‌లో అత్యధికంగా 70.39 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా 32.99శాతం పోలింగ్‌ యూసప్‌గూడలో నమోదైంది.

ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ఉండగా, సాయంత్రానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు బ్యాలెట్‌ బాక్స్‌లు పోలీసులు బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లలో మూడంచెల భద్రత కొనసాగుతోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img