Homeహైదరాబాద్latest Newsఎన్నికల ఎఫెక్ట్ .. రూ.1.30 కోట్ల నగదు పట్టివేత

ఎన్నికల ఎఫెక్ట్ .. రూ.1.30 కోట్ల నగదు పట్టివేత

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు, ఎలక్షన్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో బాగంగా తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది.
సరైన పత్రాలు లేకపోవడంతో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.1.30కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ పురుషుడితో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img