Homeహైదరాబాద్latest Newsధర్మపురి విశ్వహిందూ పరిషత్ నూతన కమిటీల ఎన్నిక సమావేశం

ధర్మపురి విశ్వహిందూ పరిషత్ నూతన కమిటీల ఎన్నిక సమావేశం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణం లోని కర్నె అక్కేపల్లి ఫంక్షన్ హాల్ లో విశ్వహిందూ పరిషత్ ధర్మపురి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా వి హెచ్ పి జిల్లా కార్యదర్శి గజం రాజ్ కుమార్ పాల్గొని కార్యకర్తలకు రాబోయే కార్యక్రమాల గురించి మార్గదర్శనం చేసినారు. అలాగే విశ్వహిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా దేశములోని అన్ని ప్రఖండ లలో సమ్మేళనాలు వచ్చే నెలలో నిర్వహించాలని కేంద్రియ సమితి సూచన. అందులో భాగంగా మన ధర్మపురి లో కూడా సమ్మేళనం నిర్వహణ పై చర్చించడం జరిగింది. ఈ సందర్బంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ధర్మపురి పట్టణ మరియు అన్ని గ్రామాల్లో వి హెచ్ పి, బజరంగ్ దళ్ సమితులను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత హిందూ ధర్మరక్షణకు సమయం ఇవ్వాలని కోరినారు. ఈ సందర్బంగా విశ్వహిందూ పరిషత్ నూతన కమిటీ ని నియమించడం జరిగింది. విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు గా ముత్యం రమేష్ ని ఉపాధ్యక్షులు గా పురంశెట్టి లచ్చన్న, గాదె లక్ష్మణ్ ను, కార్యదర్శి గా వెలగందుల బుచ్చన్న, సహా కార్యదర్శి గా ఎడ్ల రాజేష్,సేవా ప్రముఖ్ గా కలికోట రాజేష్ సత్సంగ్ ప్రముఖ్ గా శీలం తిరుపతి బజరంగ్ దళ్ సహా సంయోజక్ గా ఆసం సురేష్ . ధర్మపురి మండల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు గా మామిడాలా రవీందర్ ని, ఉపాధ్యక్షులు గా మ్యాన పూర్ణచందర్ ని, బజరంగ్ దళ్ మండల సంయోజక్ గా సోంశెట్టి సాయి ని, మల్లేశం సహా సంయోజక్ గా,భీర్పూర్ మండల బజరంగ్ దళ్ సంయోజక్ బస్వారాజుల సంతోష్ ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అల్లం దుర్గాప్రసాద్, కస్తూరి రాజన్న, చుంచుకాల కిషన్, సోంశెట్టి శివసాయి, కుమ్మరి తిరుపతి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img