రాజ్యసభ ఖాళీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, అస్సాం, హర్యానా, త్రిపుర రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. ఖాళీ అయిన అన్ని స్థానాలకు సెప్టెంబర్ 3న ఓటింగ్ జరగనుంది.