Homeజిల్లా వార్తలుజగిత్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!

జగిత్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని గోల్లపల్లి మండల కేంద్రంలోని రెడ్డి సంఘంలో సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కన్నా రమేష్ మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ,పెద్దపల్లి వాలిబాల్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి తిరుమల రావు ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా రషీద్ ని, అధ్యక్షులుగా సంజీవరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా గురజాల బుచ్చిరెడ్డిని, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు అయిన కీర్తిశేషులు అయిన శ్యామ్ సుందర్ రెడ్డి కుటుంబాన్ని సీనియర్ క్రీడాకారులందరూ పరామర్శించడం జరిగింది. వారి యొక్క చిత్రపటానికి నివాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మండల సీనియర్ క్రీడాకారులు జగన్, తాజుద్దీన్, తాడూరి బ్రహ్మం, రాజు, గణేష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img