Homeహైదరాబాద్latest Newsన్యాయవాద పరిషత్ జిల్లా కమిటీ ఎన్నిక

న్యాయవాద పరిషత్ జిల్లా కమిటీ ఎన్నిక

ఇదే నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో న్యాయవాద పరిషత్ జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా బెల్లంపల్లి కి చెందిన నల్లుల సంగీత ను న్యాయవాద పరిషత్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా నల్లుల సంగీత మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో నన్ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షులకి కృతజ్ఞతలు అని అన్నారు. అలాగే న్యాయవాద పరిషత్ బడుగు బలహీన వర్గాలకు న్యాయవాదిగా కృషి చేస్తానని అన్నారు. జనరల్ సెక్రెటరీగా ఇమ్రాన్, ట్రెజరీగా దేవరాజ్, ఈ పరిషత్ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img