ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం మొర్రయిపల్లె గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. రజక సంఘం అధ్యక్షుడుగా ఆకారం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా దుర్గయ్య క్యాషియర్ గా ఆకారం రాజు, సలహాదారులుగా ఆకారం చంద్రయ్య, వెంకటయ్య. ప్రచారకర్తలుగా ఎల్లం, అనిల్, అనిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.