Homeహైదరాబాద్latest Newsఎన్నికల ఫలితాలు : లైవ్ అప్డేట్స్

ఎన్నికల ఫలితాలు : లైవ్ అప్డేట్స్

12:03 PM లోక్‌సభ ఫలితాల్లో ఎన్డీయే, ఇండి కూటమి మధ్య పోరు నువ్వా..నేనా అన్నట్లు సాగుతోంది. ఎన్డీయే కూటమి 291 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..ఇండి కూటమి 232 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. పార్టీ పరంగా చూస్తే బీజేపీ లీడ్‌లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 272 కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే ప్రాంతీయ పార్టీలతో జతకట్టేలా వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకులు ఫలితాల్ని నిశితంగ పరిశీలిస్తుండగా బీజేపీ మాత్రం కూల్‌గా ఉంది.

11:43 AM పశ్చిమ బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. బెంగాల్ ప్ర‌జ‌లు అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌కే మ‌ద్ద‌తు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ కేవ‌లం 3 స్థానాల్లో మాత్ర‌మే ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికే ప‌రిమిత‌మైంది. ఇత‌రులు మిగ‌తా స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోన్నారు.

11:38 AM ఏపీ ప్రజల తీర్పు గత పదేళ్లుగా ఏకపక్షంగా ఉంటోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లతో అధికారం కట్టబెట్టారు. విభజన తర్వాత ఏపీని డెవలప్ చేస్తాడని, ప్రత్యేక హోదా తెస్తాడని అంతా అనుకున్నా కేంద్రలోని మోదీ ప్రభుత్వం సహకరించలేదు. అంతేగాక సంక్షేమ పథకాలు అందించినప్పటికీ అభివృద్ధి పెద్దగా జరగలేదని ప్రజల్లోకి బాగా వెళ్లింది. పొరుగు రాష్ట్రం డెవలప్‌మెంట్‌లో దూసుకెళ్తుంటే ఏపీ మాత్రం మందగమనంలో ఉందని టాక్. దీంతో విసిగిపోయిన ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశారు. 2024 ఎన్నికల్లోనూ ఏపీ ప్రజలు కూటమికి స్పష్టమైన మెజార్టీని అందించారు. మళ్లీ చంద్రబాబు నాయుడే అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు.

11:16 AM లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ లీడింగ్‌లో ఉన్నారు. కర్ణాటకలో 9 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. అన్ని స్థానాల్లో ముందంజలో ఉంది. రాజస్థాన్‌లో ఎన్డీయే, ఇండి కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

11:12 AM మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. బీజేపీతో జతకట్టిన ప్రాంతీయ పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

11:11 AM ఏపీలో అన్ని జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో వైసీపీ ప్రభావం తక్కువైంది.

11:09 AM ఆరో రౌండ్ ముగిసేసరికి కరీంనగర్‌లో బండి సంజయ్ 76,437 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11:02 AM ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం దాాాదాపుగా ఖాయమైంది. 152 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన 151 స్థానాల రికార్డును చెరిపేసేలా కనిపిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు అటు ఏపీలో, ఇటు హైదరాబాద్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. సన్నిహితులతో తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట కోసం వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు? ఎక్కడ అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నారు. కూటమి అభిమానుల ముఖాలు వెలుగుతుండగా..వైసీపీ ఫ్యాన్స్ ఫేస్‌లు డల్ అయినట్లు కనిపిస్తోంది.

10:51 AM దాదాపు 20 ఎంపీ స్థానాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది

TG : మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో బీజేపీ లీడ్‌లో ఉంది.

TG : మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. హైదరాబాద్ లో ఎంఐఎం, మెదక్‌లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది.

AP : ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఏపీ అసెంబ్లీ ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కూటమి ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 88ని దాటేసింది. 144 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పలుచోట్లు వైసీపీ నాయకులు కౌంటింగ్ కేంద్రాల నుంచి నైరాశ్యంతో వెనుదిరిగారు. వైసీపీ ఓటమి దాదాపు ఖాయమైంది.

AP : పిఠాపురంలో నాలుగో రౌండ్ ముగిసేసరికి 19 వేల ఓట్ల మెజార్టీతో పవన్ కొనసాగుతున్నారు. ఇంకా 14 రౌండ్లు మిగిలి ఉన్నాయి. పవన్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అంచనా. పవన్ గెలిస్తే ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

వారణాసిలో ప్రధాని మోదీ మూడో రౌండ్ ముగిసేసరికి 9 వేల ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. 2914 స్థానాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 210 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో కూటమి 137 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, వైసీపీ 21 స్థానాల్లో లీడ్‌లో ఉంది. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ 16 వేల ఓట్ల మెజార్టీలో ఉన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ 9 స్థానాల్లో , బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో ఉంది. కరీంనగర్ లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ముందంజలో ఉన్నారు. వారణాసిలో ప్రధాని మోదీ 4000 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది. 101 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా, వైసీపీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వయనాడ్ , రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ 16 వేల ఓట్ల ముందంజలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img