బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటోన్మెంట్ నియోజకవర్గ నేతలతో నేడు (ఆదివారం) సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే భేటీలో కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారని సమాచారం. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్‌ను బరిలోకి దింపింది.