లోక్ సభ ఎన్నికలకు ముందే అధికారులు రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.4,650 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఈ సారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్ల కంటే ఎక్కువ. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతి రోజూ రూ.100 కోట్ల చొప్పున సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది.