జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేయడంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుపట్టారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగం కాదా అని ప్రశ్నించారు. ”జమ్మూకశ్మీర్ అంశం ప్రస్తావనకు తగదని ఆయన అనుకుంటారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి పదవి అంటే చిన్న పదవేమీ కాదు. రాజస్థాన్ వచ్చి 370వ అధికరణను ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని ఆయన అనడం సిగ్గుచేటు” అని పేర్కొన్నారు.