శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. గోకర్ణపల్లిలో టీడీపీ, వైసీపీ నేతలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ కొట్లాటలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్పీకర్ సతీమణి తమ్మినేని వాణి జనరల్ ఏజెంట్‌గా పోలింగ్ కేంద్రంలో బైఠాయించారు. దాంతో వాణిని బయటకు పంపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయడంతో వాగ్వాదం జరిగింది. సెంట్రల్ ఫోర్స్ అధికారులు మోహరించి ఇరువర్గాలను చెదరగొట్టారు.