కరెంట్ బిల్లు(Electricity Bill) సాధారణం కంటే కొంచెం ఎక్కువగా మనం కంగారుపడుతాం.. అదే కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వస్తే.. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ జిల్లాలోని జట్టన్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త లలిత్ ధీమాన్ కు ప్రతి నెలా రూ.3,000 కంటే తక్కువ కరెంట్ బిల్లు వచ్చేది. కానీ ఒకేసారి రూ.210 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. తాజాగా అతడికి రూ.210,42,08,405 బిల్లును ఇవ్వడంతో అవాక్కయ్యాడు. దీనిపై విద్యుత్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయగా విద్యుత్తు బిల్లు రికార్డులను పరిశీలించారు. బిల్లు రూ.210 కోట్లు కాదు.. రూ.4,047 అని సవరించటంతో లలిత్ ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ (Electricity Bill)
మహారాష్ట్రలో కొత్త వ్యాధి.. కేవలం వారం రోజుల్లోనే జుట్టు..!!
మేనకోడలి ప్రేమ పెళ్లి.. కోపంతో భోజనంలో విషం కలిపిన మేనమామ.. చివరికి..!