ఇదేనిజం, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లు తలేత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నారాయణాఖేడ్ డిఈ, ఎడిఈ తో అయన సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..విద్యుత్ శాఖ అధికారులు తమ పనితీరు మార్చుకోవాలన్నారు. నారాయణాఖేడ్ నియోజకవర్గం లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కారించాలన్నారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలోఎలాంటి అంతరాయలు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.అధికారులు విధులపట్ల నిర్లక్ష్యం వహించారుదని అన్నారు.ఎలాంటి సమస్యలు ఉన్న తెలుసుకొని వెంటనే పరిష్కారించాలని అన్నారు. ప్రజలకు,రైతులకు ఎలాంటి ఇబ్బదులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.అవసరమైన నిధులు ప్రభుత్వం నుండి మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.విద్యుత్ శాఖ సిబ్బంది సమయానికి స్పందించాలని అన్నారు. ఇక మీదట సమస్య రాకుండా చూడలని అన్నారు..పని చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.