Homeహైదరాబాద్latest Newsవిద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించిన విద్యుత్ అధికారులు

విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించిన విద్యుత్ అధికారులు

ఇదే నిజం, ధర్మపురి రూరల్ : విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ ప్రారంభించిన పొలంబాట కార్యక్రమంలో భాగంగా సూచనలను ఇస్తూ విద్యుత్ శాఖ ఏ డి ఈ టి. సింధూర్ శర్మ , ఏఈ బండారి అశోక్ ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామ పరిధిలో అవగాహన కల్పించారు. ఏడిఈ మాట్లాడుతూ గాలి & వానల కారణంగా లైన్స్ తెగిన, పోల్స్ వంగిన సిబ్బందికి సమాచారం ఇవ్వగలరు. అలాగే ట్రాన్స్ఫార్మర్ల వద్దకి పశువులని వెళ్లకుండా రైతులుజాగ్రత్త వహించాలన్నారు. రైతుల పొలాల్లో కరెంటు స్టార్టర్ కు ఇనుప డబ్బాలు కాకుండా ఫైబర్ డబ్బాలు మార్చుకోవాలన్నారు. అలాగే మోటర్ స్టార్టర్లకి కెపాసిటర్లను అమర్చుకోవాల్సిందిగా సూచనలిస్తూ వాటి ద్వారామోటర్లు కాలిపోకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏ డి ఈ, ఏఈ,లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు,రైతులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img