Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో విద్యుత్ సేవలు… ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణలో విద్యుత్ సేవలు… ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజలకు విద్యుత్ సేవలు అందిచేందుకు దేశంలోనే తొలిసారి అంబులెన్స్ తరహాలోనే ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం GHMC పరిధిలోని 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలను కేటాయిస్తూ డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వాహనాలను ప్రారంభించారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్
మెన్లు మరియు అవసరమైన మెటీరియల్ తో సేవలు అందించేందుకు 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు అని తెలిపారు. అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణ కోసం గతంలో ప్రత్యేక వాహనాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించేందుకు అంబులెన్స్‌ల వంటి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Recent

- Advertisment -spot_img