తెలంగాణలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో దశ, దిశలేని పాలన నడుస్తోంది. బీఆర్ఎస్‌ను విమర్శించడం తప్ప బడ్జెట్‌లో ఏముంది. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ ఆశించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చెందిందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. అయినా.. బడ్జెట్‌లో తప్పుడు ప్రచారం చేశారు’’ అని అన్నారు.
రూ.4 వేల పెన్షన్ ఏమైంది?
TG: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో ప్రకటించిన రూ.4 వేల పెన్షన్ హామీపై బడ్జెట్‌లో ఊసే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బడ్జెట్‌లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ.. అవాస్తవాల విస్తరణ. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సాధించిన ఘనతలకు సంబంధించిన వివరాలను.. పబ్లిక్ డొమైన్ల నుంచి తొలగించారు. కంప్యూటర్లలో డాటాను తొలగించారేమో.. ప్రజల మనసులోంచి వాస్తవాలు తొలగించలేరు’’ అని తెలిపారు.