Homeహైదరాబాద్latest Newsమరో వ్యక్తి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..?

మరో వ్యక్తి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..?

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ మరో ముందడుగు వేసింది. ఈ ఏడాది జనవరిలో ఓ మనిషి (అర్బాగ్) మెదడులో తొలిసారి ఎలక్ట్రానిక్ చిప్ అమర్చింది. తాజాగా రెండో వ్యక్తికి సైతం చిప్ అమర్చినట్లు ప్రకటించింది. రెండో వ్యక్తి మెదడులోనూ 400 ఎలక్ట్రోడ్‌‌లు సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు సంస్థ CEO ఎలాన్ మస్క్ తెలిపారు. 2024 డిసెంబర్‌లోగా మరో 8 మంది మెదళ్లలో చిప్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

ఇది ఎలా పనిచేస్తుందంటే
బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ కలిగిన N1 అనే ఎలక్ట్రానిక్ చిప్‌ను మనిషి తలలో అమర్చుతారు. ఆ చిప్ 8 mm వ్యాసం ఉంటుంది. దీనిలోని 3 వేలకు పైగా ఎలక్ట్రోడ్‌లను మెదడులో ప్రవేశపెడతారు. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను ఎలక్ట్రోడ్‌లు గుర్తించి చిప్‌నకు పంపుతాయి. పక్షవాతం, వెన్నెముకకు గాయాలు, నాడీ సమస్యలు ఉన్న రోగులు AI ఆధారిత ఈ చిప్ సాయంతో స్మార్ట్ ఫోన్లు సైతం వినియోగించే వీలుంటుంది.

Recent

- Advertisment -spot_img