ప్రస్తుతం అన్ని బాషల సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ లో అదరకొడుతున్నాయి. ‘బాహుబలి’ సినిమాతో మొదలైన ఈ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి తిరుగులేని కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే ఇవి అత్యధిక హైయెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి కానీ మొదటి రోజు మొత్తం సినిమా బడ్జెట్‌ను వసూలు చేయడంలో విఫలమయ్యాయి. కానీ ఒక్క సినిమా మాత్రం తొలిరోజు ఓపెనింగ్ కలెక్షన్లలో బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేసింది. ఆ అరుదైన రికార్డు సౌత్ ఇండియన్ సినిమాకే దక్కింది. ఆ సినిమానే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’.
కన్నడ స్టార్ ‘యాష్’ గా నటించిన సినిమా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని రూ.100 కోట్లు బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. అయితే ఈ సినిమా విడుదలైన తొలిరోజు రూ.164 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. చాలా తక్కువ సమయంలో ఈ సినిమా బడ్జెట్ ని వసూలు చేసిన ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలోనే ‘కేజీఎఫ్ చాప్టర్ 3’మూవీ కూడా రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.