Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ (Elon Musk) ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ”ఎక్స్”ను అమ్మేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, బయటి వ్యక్తులకు కాదు. మస్క్ దానిని AI స్టార్టప్ కంపెనీ ‘X AI’కి విక్రయించాడు. 2022లో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేశాడు మరియు ఇప్పుడు అతను ప్లాట్‌ఫామ్‌ను $33 బిలియన్లకు (రూ. 2.80 లక్షల కోట్లు) విక్రయించినట్లు ప్రకటించాడు.అధునాతన ఏఐ టెక్నాలజీని ‘ఎక్స్’తో అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని మస్క్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ‘X’ కి 600 మిలియన్ల యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం, ఎలాన్ మస్క్ టెస్లా మరియు స్పేస్‌ఎక్స్‌లకు CEO మాత్రమే కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు.