Homeజిల్లా వార్తలుముస్తాబాద్ శ్రీ శివకేశవ ఆలయాల చైర్మన్ గా మూడోసారి ఎల్సాని దేవయ్య ఎన్నిక..!

ముస్తాబాద్ శ్రీ శివకేశవ ఆలయాల చైర్మన్ గా మూడోసారి ఎల్సాని దేవయ్య ఎన్నిక..!

ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని అతి పురాతన ప్రసిద్ధి చెందిన శ్రీ శివ కేశవుల ఆలయాల కమిటీ ఎన్నికలు ప్రతి ఏడాది ఆలయ చావడిలో స్థానికుల మధ్యన జరుగుతాయి. ఎప్పటి మాదిరిగానే ఆలయ నూతన కమిటీ ఎన్నికలు గ్రామస్తుల సమక్షంలో జరిగాయి. కాగా చైర్మన్ పదవి కోసం వరుసగా రెండు సార్లు చైర్మన్ పదవి చేపట్టిన ఎల్సాని దేవయ్య, అలాగే గతంలో రెండుసార్లు చైర్మన్ గా ఉన్న ఓరగంటి తిరుపతి తో పాటు బద్దిపడగ ప్రతాపరెడ్డి, బాలసాని శ్రీనివాస్ గౌడ్ తోపాటు మిరుదొడ్డి దేవయ్యలు బరిలో ఉడగా . ఏకగ్రీవం చేయడం కోసం గ్రామస్తులు కృషి చేసినప్పటికీ ఎవరు అధ్యక్ష పదవి పోటీ నుండి తప్పుకోకపోవడంతో ముందుగా డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగించారు.

దీంతో 45 మంది డైరెక్టర్లను గ్రామస్తులు ఎన్నుకున్నారు. వీరిలో నుంచి 43 మంది చైర్మన్ ఎన్నిక కోసం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఎల్సాని దేవయ్యకు 24, ఒరగంటి తిరుపతికి 14, బద్దిపడగ ప్రతాపరెడ్డికి ఐదు ఓట్లు మిగతా ఇద్దరికీ ఓట్లు రాకపోవడంతో పది ఓట్ల తేడాతో హ్యాట్రిక్ చైర్మన్ గా దేవయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కొల్లూరు నరసింహులు, కోశాధికారిగా ఆవుల రాజేశం ఎన్నికయ్యారు, దీంతో నూతనంగా ఎన్నికైన చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులను గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టపాకాయలు, కొబ్బరికాయలు, కొరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ కార్య్రమంలో గ్రామస్తులు , యువకులు కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img