Homeహైదరాబాద్latest Newsమహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి అస్వస్థత

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి అస్వస్థత

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. షిండే జ్వరం మరియు గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అయితే మహారాష్ట్ర సీఎం ఎంపిక, మంత్రి పదవుల కేటాయింపు తదితర అంశాలపై బీజేపీ నేతలతో చర్చలు జరిపేందుకు ఆయన సోమవారం ముంబై చేరుకున్నారు. అయితే ఇటీవల షిండే ఆరోగ్యం క్షీణించడంతో థానేలోని ఆసుపత్రికి తరలించారు.మరోవైపు, మహారాష్ట్ర సీఎం పీఠంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img