తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును పక్కదారి పట్టించడానికే కౌశిక్‌రెడ్డిపై దాడికి దిగారని ఆరోపించారు. తమపై ఎన్ని రాళ్లు వేసినా వాటితోనే మళ్లీ అధికారంలోకి వస్తామని తెలిపారు.