ఇదే నిజం – కోరుట్ల : ప్రభుత్వ ఉద్ధేశ్యం మంచిదే.! కానీ..ఆ ఉద్ధేశ్యం ఉపయోగపడుతుందా.? లేదా? అన్న పర్యవేక్షణ మాత్రం శూన్యం.! మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఓ చెట్టుకు ‘సిగ్గరుల కోసం-ఉచిత కండోమ్’ లభించేలా ఓ డబ్బాను బిగించారు..బాగానే ఉంది.! అయితే.. అందులో కండోమ్ లు ఉంచాల్సిన ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేయడంతో..పేషెంట్లను పరామర్శించేందుకు వచ్చే విజిటర్స్ తాగే పారేసే ‘ఖాళీ-టీ కప్పులు’ ఈ డబ్బాలో వేస్తుండడం ‘ఇదే నిజం’ కెమెరా కంట్లో పడింది..!! ఇదండీ ఆసుపత్రి సిబ్బందికి ‘సెల్లులో-సొల్లు’ ముచ్చట్లకు టైం దొరుకుతుంది కానీ.. ప్రభుత్వ ఉద్ధేశ్యాలను సక్రమంగా అమలు చేయడంలో కనిపించదని ఈ ‘డబ్బా’నే నిదర్శనం.!!
………