Homeహైదరాబాద్latest NewsEmpuran : మోహన్ లాల్ ''ఎంపురాన్'' మూవీ మరో ''కేజీఎఫ్''.. సినిమా ఎలా ఉందంటే..?

Empuran : మోహన్ లాల్ ”ఎంపురాన్” మూవీ మరో ”కేజీఎఫ్”.. సినిమా ఎలా ఉందంటే..?

Empuran : మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన సినిమా ”L2E ఎంపురాన్” (Empuran). ఈ సినిమాకి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2019లో వచ్చిన ”లూసిఫర్” సినిమాకి సీక్వెల్ గా రానుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తుంది.ఈ సినిమా కధ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక పెద్ద డాన్.. ఒక సాధారణ వ్యక్తిగా మారడానికి కారణం ఏంటి.. అసలు అతనకి రాజకీయాలకు సంబంధం ఏంటి అనే అంశం చుటూ ఈ సినిమా కధ తిరుగుతుంది. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ 50 నిమిషాల తర్వాత తెరపై కనిపిస్తాడు. మొదటి అర్ధభాగం కొంచం సహనాన్ని పరీక్షిస్తుంది. అలాగే ఈ చాలా స్లో మోషన్ షాట్లు ఉన్నాయి. మోహన్ లాల్ కి ఈ సినిమాలో ఎలివేషన్ షాట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సినిమాలోని సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో డ్రామా తక్కువ, స్టైల్ ఎక్కువ. అయితే ఈ సినిమాని ”కేజీఎఫ్” లాగ తీయాలని చాలా కష్టపడ్డారు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది. స్టోరీ లేని సినిమాకి ఎలివేషన్ షాట్స్ ఉంటే ఎలా ఉంటోందో ఆలా ఉంది.

Recent

- Advertisment -spot_img