Homeహైదరాబాద్latest NewsEncounter : మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. తెలంగాణ మావోయిస్టు సెక్రటరీ దామోదర్ మృతి

Encounter : మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. తెలంగాణ మావోయిస్టు సెక్రటరీ దామోదర్ మృతి

Encounter : మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter) తెలంగాణ మావోయిస్టు పార్టీ కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీనే నిర్ధారించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో దామోదర్‌తో పాటు మరో 17 మంది మరణించారు. 1993లో పీపుల్స్‌ వార్‌లో చేరిన దామోదర్ 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు.

Recent

- Advertisment -spot_img