Homeక్రైంకశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ఉగ్రవాది హతం

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ఉగ్రవాది హతం

– రాజౌరీ జిల్లాలో ఘటన

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్​లో నలుగురు సైనికులు వీరమరణం చెందిన విషయం తెలిసిందే. ఇదే ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ కీలక ఉగ్రవాదీ హతమయ్యాడు. అతడిని క్వారీగా గుర్తించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. లష్కరే తోయిబాలో అతడు ఉన్నత స్థాయి ఉగ్రనేత అని, పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని తెలిపాయి. మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్‌ రెండో రోజూ కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. ‘పాకిస్థాన్‌కు చెందిన క్వారీ.. పాక్‌- అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉగ్ర శిక్షణ పొందాడు. లష్కరే తోయిబాలో హై ర్యాంకు కలిగిన నాయకుడు. గత ఏడాది కాలంగా తన బృందంతో కలిసి రాజౌరీ- పూంచ్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. డాంగ్రీ, కాండీ దాడుల వెనుక సూత్రధారి అతడే! ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్నిపునరుద్ధరించేందుకు అతడిని పంపారు. అతడు పేలుడు పదార్థాల తయారీతో పాటు గుహల్లో నక్కి ఉగ్రకార్యకలాపాలు నిర్వహించడంలో నిపుణుడు. శిక్షణ పొందిన స్నైపర్‌ కూడా’అని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

Recent

- Advertisment -spot_img