హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. వ్యాపారాల నిమిత్తం ముందుగా చిన్న షాపులు ఏర్పాలు చేసి ఆ తర్వాత నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. స్థలాలను కబ్జా చేస్తున్నారని చెబుతున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో వ్యతిరేకత్ తీవ్రమవుతోంది. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.