ENG vs IND: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (161) సూపర్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా, రవీంద్ర జడేజా (69), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 427 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించింది.
ఫలితంగా, ఇంగ్లండ్ జట్టు ముందు 608 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్, షోయబ్ బషీర్ చెరో రెండు వికెట్లు తీయగా, జో రూట్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బ్యాటర్లు గట్టి పోరాటం చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ ఫలితం కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.