ఇదేనిజం,శేరిలింగంపల్లి: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ లో మాస్టర్ మైండ్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్, సుభాష్ చంద్ర బోస్ నగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, శివ, మునాఫ్ ఖాన్, ఇస్మాయిల్, ముక్తర్,వెంకటేష్, సత్యనారాయణ యాదవ్,బుజంగం, రాములుయాదవ్,ఖాజా, అష్రాఫ్,మహిళలు శశిరేఖ, లక్ష్మీ, పార్వతి పాల్గొన్నారు.